నిటీ ఎన్‌డబ్ల్యుఆర్ 24x7 లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్
బెంగళూర్: వార్తలు, అభిప్రాయాలు, ట్యూన్స్‌కు సంబంధించి నిటీ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్‌డబ్ల్యుఆర్ లైవ్ 24x7 లైవ్ ఇంటర్నెట్ స్ట్రీమింగ్ సర్వీసును ప్రారంభించింది. ఇంటర్నెట్ సౌకర్యం గల అన్ని మొబైల్ పరికరాల్లో లైవ్ ఆడియో సర్వీసును నిటీ డిజిటల్ సోమవారం ప్రారంభించింది. ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన వెంటనే సోషల్ మీడియాలు ట్విట్టర్, ఫేస్‌బుక్కుల్లో పొందిన అద్భుతమైన అనుభూతిపై సందేశాలు వెల్లువెత్తాయి. NWRLive.com నిటీ డిజిటల్ ప్రారంభించింది.
నిటీ డిజిటల్ స్టూడియోలో జరిగిన ఎన్‌డబ్ల్యుఆర్ లైవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్‌డబ్ల్యుఆర్ శ్రోతలను ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత రామ్ మాధవ్ పలకరించారు, వారికి శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తి, జాతీయ భారత పౌరులకు ఇది కొత్త వేదిక అవుతుందని ఆయన అన్నారు.

భారతదేశంలోని మీడియా పరిణామ క్రమంలో తన అనుభవాలను బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, పయనీర్ సంపాదకుడు డాక్టర్ చందన్ మిత్రా వివరించారు. భారతదేశంలో ఎన్‌డబ్ల్యుఆర్ తొలి స్వతంత్ర ఆడియో వేదిక అవుతుందని ఆయన అన్నారు.
ఆడియో ద్వారా తమ వ్యాఖ్యానాలతో కొత్త దిశను చూపుతున్న ఎన్‌డబ్ల్యుఆర్ లైవ్ టీమ్‌కు ప్రముఖ సెంటర్ రైట్ కాలమిస్టులు అశోక్ మాలిక్, సంధ్య జైన్ శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఎన్ఆర్‌డబ్ల్యు జట్టులో ఉత్సాహం నింపారు.
నిటీ డిజిటల్ వ్యవస్థాపకుడు రాజేష్ జైన్ ఈ సందర్భంగా మాట్లాడారు. డిజిటల్ మీడియాలో ఎన్‌డబ్ల్యూఆర్ వైల్ ఏ విధమైన కీలకమైన మలుపు అనే విషయాన్ని ఆయన వివరించారు. మెసెంజర్‌ను ఎంగేజ్ చేస్తూ సందేశాన్ని, మీడియమ్‌ను మారుస్తుందని అన్నారు.
అతిథులకు నిటీ డిజిటల్ ఎడిటోరియల్ డైరెక్టర్ కాంచన్ గుప్తా స్వాగతం చెప్పారు. మీడియా ఆవరణను ఇది ఎలా మార్చివేస్తుందో ఆయన ఉద్వేగభరితంగా చెప్పారు.
ఎన్‌డబ్ల్యూఆర్ లైవ్‌ను వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. అలాగే మొబైల్ పరికరాల్లోని ప్రత్యేకమైన అప్లికేషన్స్ ద్వారా కూడా పొందవచ్చు. వివరాలు వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
NWR Liveను పొందే మార్గం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications