వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన జరుగబోతుంది: పాల్వాయి, రౌండ్‌టేబుల్‌కు కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palvai goverdhan reddy
న్యూఢిల్లీ/చిత్తూరు: అతి త్వరలో విభజన జరుగబోతుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గురువారం అన్నారు. ఆయన ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ఉందని చెప్పారు.

త్వరలో రాష్ట్ర విభజన జరుగబోతుందన్నారు. విభజన జరిగితే సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జరిగే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసెంబ్లీలో తీర్మానం పెట్టవల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఐకాస రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేసాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బిజెపి, టిఆర్ఎస్, జనతా పార్టీ, సోషలిస్టు, బోడో ల్యాండ్, జెఎంఎం, అమ్ ఆద్మీ, ఎంసిపి, ఆర్ఎల్డీ, ఐజెపి, సిపిఎం న్యూడెమోక్రసీ, జమ్ము కాశ్మీర్ ప్యాంతర్స్ పార్టీలు హాజరయ్యాయి. బిజెపి నుండి దత్తాత్రేయ, టిఆర్ఎస్ నుండి కె కేశవ రావు, వివేక్, ఆర్ఎల్డీ నుండి కెఎస్ మాన్, రియాజ్, సిపిఐ నుండి అజీజ్ భాషాలు హాజరయ్యారు.

తెలంగాణ సాధనే తమ లక్ష్యమని, పోరాటం సాగిస్తామని, తెలంగాణపై కాంగ్రెసు పార్టీ మాట నిలబెట్టుకోలేక పోయిందని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆరోపించారు. సాయంత్రం వరకు రౌండ్ టేబుల్ సమావేశం జరుగనుంది. సాయంత్రం ముగిసిన ఈ సమావేశంలో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని తీర్మానం చేశారు.

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: దానం

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల సంక్షేమం కోసమే అని ఎన్నికల కోసం కాదని దానం తెలిపారు. తెలంగాణపై అధిష్టానం కసరత్తు చేస్తోందని, పార్టీ నిర్ణయానకి అందరు కట్టుబడి ఉండాలన్నారు.

English summary
Congress Party senior leader and Rajyasabha Member Palvai Goverdhan Reddy on Thursday said that state will divide very soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X