అప్పు: స్నేహితురాలిపై దాడి, ఎమ్మెల్యే భార్యపై ఫిర్యాదు

ఇంకా రూ.1.80 కోట్లు ఇవ్వాల్సి ఉందంటూ సుధీర్ రెడ్డి మేనల్లుడుని వెంటబెట్టుకొని కమల ఆదివారం రాత్రి అరుణ ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఈ క్రమంలో అరుణ తలకు గాయమైంది. దీంతో మిగిలిన డబ్బులు ఇవ్వకుంటే తనను చంపుతానని బెదిరించారని, తన కుటుంబానికి కమల నుండి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ అరుణ ఆదివారం సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
ఆస్మాన్‌ఘడ్ త్రివేణి నగర్‌లో ఉండే ఎల్ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆంజనేయులు, భార్య అరుణ ఉంటున్నారు. కమల నుంచి రూ.2 కోట్లు అప్పు తీసుకున్న అరుణ.. ఆ డబ్బును అధిక వడ్డీకి అబిడ్స్‌లోని ఓ జువెలర్స్ యజమానికి ఇచ్చారు. సదరు జువెలర్స్ యజమాని వ్యాపారంలో నష్టం వచ్చి దివాళా తీశాడు. ఇటీవల ఐపి పెట్టాడు.
ఈ నేపథ్యంలో అప్పు మొత్తం తీర్చానని అరుణ చెప్పగా.. ఇంకా చెల్లించాల్సి ఉందని కమల అరుణ ఇంటికి వచ్చి గొడవ పడ్డారు. తాను చెల్లించాల్సిది ఏమీ లేదని అరుణ చెప్పడంతో వారు ఆమెపై దాడి చేశారు. అరుణకు గాయమైంది. అరుణ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. కాగా, తన భార్యను పావుగా చేసి కొందరు రాజకీయ లబ్ధి పొందేందుకు నాటకాలాడుతున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications