వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ నేతపై షర్మిల సెక్యూరిటీ గార్డుల దాడి, క్షమాపణలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
విజయనగరం/ కడప: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జయరాజ్‌పై షర్మిల సెక్యూరిటీ సిబ్బంది చేయిచేసుకున్నారు. సోమవారం చింతలపాలెంలో పాదయాత్రలో చేసిన షర్మిల బసకు ఏర్పాటు చేసిన జయరాజ్ శిబిరంలో ఉన్న ఆమెను కలిసేందుకు యత్నించారు.

అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకోవడమే కాక చేయిచేసుకుని, చొక్కా చించివేశారు. ఈ విషయం తెలుసుకున్న షర్మిల లోపలి నుంచి వచ్చి సెక్యూరిటీతో జయరాజ్‌కు క్షమాపణ చెప్పించారు. అంతకు ముందు పాదయాత్రలో భాగంగా షర్మిల కొత్తవలసలో ఒక సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ తోడుదొంగలని విమర్శించారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ 64వ జయంతిని పురస్కరించుకుని సోమవారం విజయలక్ష్మి, కోడలు వై ఎస్ భారతి, కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయను సందర్శించారు. సమాధిపై పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులు అర్పించారు. మోకరిల్లి సమాధివద్ద కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్‌లో చర్చి పాస్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, వైకాపా జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

English summary
The YSR Congress party president YS Jagan's sister Sharmila security gaurds attacked party leader Jayaraj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X