తెలంగాణ: 'బొత్స మారిపోయారు', 12న సీమాంధ్ర బంద్

టిడిపి ముందుకు రావాలి: గంటా
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మంత్రి గంటా శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. కేవలం ఓ ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వడం సరికాదన్నారు. ఇస్తే మూడు ప్రాంతాలకు ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తెలుగుదేశం పార్టీ ముందుకు రావాలని ఆయన అన్నారు.
సమైక్యవాదినే: శత్రుచర్ల
తాను సమైక్యవాదినేనని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో విభజన జరగదని అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. 12న కేవలం అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటుందని చెప్పారు. రాయల తెలంగాణ ప్రస్తావనే లేదన్నారు.
ప్రాణం ఉన్నంత వరకు..: కనుమూరి
తన ప్రాణం ఉన్నంత వరకు తాను సమైక్యవాదిగానే ఉంటానని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. ఓటు బ్యాంకు ఉద్యమాలు సరికాదని ఆయన అన్నారు.
దిగ్విజయ్‌తో పురంధేశ్వరి భేటీ
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో కేంద్రమంత్రి పురంధేశ్వరి భేటీ అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. 12న కోర్ కమిటీలో తెలంగాణపై చర్చ సాగుతుందని, తమ అభిప్రాయాలను కోర్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్తారని పురంధేశ్వరి చెప్పారు. మరోవైపు టి కాంగ్రెసు ఎంపీలు పోన్నం ప్రభాకర్ నివాసంలో భేటీ అయ్యారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆనంద భాస్కర్, మధుయాష్కీలు భేటీలో పాల్గొన్నారు.
12న సీమాంధ్ర బంద్
సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి పట్టణ క్లబ్ వద్ద విద్యార్థులు రోడ్డు పైన బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వాహనాలను మరో మార్గం ద్వారా మళ్లించారు. కాగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి ఈ నెల 12న బందుకు పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications