విలీనంపై కెసిఆర్‌దే: డిఎస్, బొత్స మారారు: జెసి

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో కాంగ్రెసు బలపడే విధంగా కోర్ కమిటీలో చర్చలు జరుపుతారని, తెలంగాణకు అనుకూలంగా ఈ సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని డిఎస్ అన్నారు. పటాన్‌చెర్వు శానససభ్యుడు నందీశ్వర్ గౌడ్ కూడా ఆయన వెంట ఉన్నారు.
రాష్ట్ర పరిస్థితులపై తమ పార్టీ కోర్ కమిటీ ఏదో నిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. విభజన అంటూ జరిగితేనే రాయల తెలంగాణ ప్రస్తావన వస్తుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజీనామాలు సర్వసాధారణణమైపోయాయని ఆయన వ్యాఖ్యానిచంారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బహిరంగంగానే చెప్పారని ఆయన గుర్తు చేశారు. పరిస్థితుల కారణంగానే బొత్స మాటల్లో మార్పు వచ్చిందని జెసి అన్నారు.
తాను సమైక్యవాదినేనని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నానని ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తూ మార్గమధ్యంలో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఆయన ఆగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications