తెలంగాణ, కెసిఆర్: చంద్రబాబుపై లక్ష్మీపార్వతి నిప్పులు

నిన్నటి వరకు కాంగ్రెసు పార్టీ తెలంగాణ విషయంలో మౌనంగా ఉందని, చంద్రబాబు లేఖ ఇచ్చానని చెప్పిన తర్వాతనే విభజన వైపు మొగ్గు చూపుతోందన్నారు. ఇప్పటికే టిడిపిని బాబు భ్రష్టు పట్టించారని, ఇప్పుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడం ద్వారా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తాను తెలంగాణవాదాన్ని తప్పుపట్టడం లేదన్నారు. అయితే గతంలో ఇప్పుడున్నంత మాత్రం లేదని చెప్పారు. రోశయ్య, చంద్రబాబు, కిరణ్‌లు సమర్థవంతంగా లేకపోవడం వల్లనే ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు.
బాబు హయాం నుండి రాష్ట్రం విచ్ఛిన్న దశకు పోతోందని ఆరోపించారు. బాబు ఆలోచన లేకుండా పార్టీ సిద్ధాంతాన్ని నాశనం చేస్తున్నారని, అధికార వ్యామోహంతోనే తెలంగాణ నినాదం ఎత్తుకున్నారన్నారు. ఈ పాలనలో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిందన్నారు.
బాబు తప్పిదాల వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టుకు వచ్చారని, మన నాయకుల వైఫల్యం కారణంగా ఉద్యమానికి ఊపిరి వచ్చిందని అన్నారు. చంద్రబాబు నాయుడు టిడిపి అధ్యక్షుడిగా అనర్హుడని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications