తెలంగాణ కోసం యువకుడి ఆత్మహత్య యత్నం

మంగళవారం విధులు నిర్వర్తించి తిరిగి ఇంటికి చేరుకున్న రాకేష్ తెలంగాణపై నాయకులు చేస్తున్న ప్రకటనలకు మనస్తాపం చెంది రాత్రి 9గంటల ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. రాకేష్ సుమారు 96శాతం గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు.
ఇటీవల నల్లగొండ జిల్లా చిట్యాల మండలం మొగిలిదోరి గ్రామానికి చెందిన అరిగి శిరీష (16) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణకోసమే ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె సూసైడ్ నోట్‌లో తెలిపింది. ఆమె బ్యాగ్‌లో సూసైడ్ నోట్ లభించింది. అరిగె సైదులు, అనితల కుమార్తె శిరీష నల్లగొండలో హస్టల్‌లోవుంటూ పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది.
శిరీష పురుగుల మందు తాగడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శిరీష మృతిచెందింది. తెలంగాణపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని, ఇక తెలంగాణ రాదేమోనని అన్పించడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె బ్యాగులో లభించిన ఓ సూసైడ్ నోట్‌లో రాసి ఉంది.












Click it and Unblock the Notifications