అఫైర్: భర్తను చంపిన భార్య, రక్తం దుస్తులతో పిఎస్‌కు

Angry wife kills man over affair
న్యూఢిల్లీ: తన భర్తను చంపి రక్తం మరకల దుస్తులో నేరుగా వచ్చిన మహిళను చూసి ఢిల్లీలోని ఓ పోలీసు స్టేషన్ అధికారులు నివ్వెరపోయారు. ఆమె పోలీసు స్టేషన్‌కు వచ్చిన తాను తన భర్తను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. ఆమెతో పాటు సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన గోకుల్‌పురిలో జరిగింది. ఉత్తమ్ దేవి అనే 33 ఏళ్ల మహిళ తన భర్త తలను దాదాపు డజన్ సార్లు గోడకేసి బాదింది. ఆ తర్వాత గొంతు నులిమి చంపింది. మహిళను పోలీసులు అరెస్టు చేసి ఆమె భరత్ సింగ్ శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

హత్యలో మహిళ సోదరుడు, మరికొంత మంది పాలు పంచుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భరత్ ధనపాల్ సింగ్ (43) నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఓ యువతితో సింగ్ అక్రమ సంబంధంపై భార్య ఉత్తమ్ దేవి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. ఈ నెల 4వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.

సోమవారం మరోసారి ఇరువురి మధ్య గొడవ జరిగింది. భార్య ఉత్తమ్‌ను సింగ్ కొట్టడమే కాకుండా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఉత్తమ్ తన సోదరుడు, మరి కొంత మందిని కూడగట్టుకుని మంగళవారం ఉదయం హత్య చేసినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+