ఆ ముఖ్యమంత్రి ఫేస్‌బుక్ లైక్స్ కొనుక్కుంటున్నారా?

సామాజిక వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ను ఫాలో అవుతున్న గెహ్లాట్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గెహ్లాట్ ఫేస్‌బుక్‌లో లైక్స్ కొనుక్కుంటున్నారంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపించినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. జూన్ 30వ తేది వరకు ఆయనకు ఉన్న లైక్స్ ఒక్కసారిగా పెద్ద ఎత్తున పెరిగాయని బిజెపి నేత జ్యోతికిరణ్ చెబుతున్నారు.
ఆ లైక్స్ కూడా టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఇస్తాంబుల్‌లోని ఐటి సంస్థల నుంచి గెహ్లాట్ గుంపగుత్తగా లైక్స్ కొనుక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. 62 ఏళ్ల గెహ్లాట్ ఫేస్‌బుక్ పేజి లైక్స్ జూన్ 30వ తేది నాటికి 2,14,639 ఉన్నాయని, ఆ తర్వాత ఒక్కసారిగా ఆ లైక్స్ పెరిగాయని జ్యోతి కిరణ్ వాదిస్తున్నారు.
ఇస్తాంబుల్‌లోని ఐటి కంపెనీ నుండి గెహ్లాట్ లైక్స్‌ను కొన్నారని ఆరోపించారు. అయితే ఇదంతా బిజెపి కట్టుకథ అని, గతంలో వాళ్లు మోడీ కోసం అలా కొనుక్కున్నారు కాబట్టే ఇప్పుడు గెహ్లాట్‌ను అపఖ్యాతి పాలు చేసేందుకు లైక్స్ కొన్నారని ఆరోపిస్తున్నారని కాంగ్రెసు అంటోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ - బిజెపిల మధ్య సామాజిక వెబ్‌సైట్‌లలో ఎప్పటి నుండో వార్ నడుస్తోంది.












Click it and Unblock the Notifications