బోద్‌గయ పేలుళ్లు మా పనే: ఇండియన్ ముజాహిదీన్

పాట్నా: బీహార్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బుద్దగయలోని మహాబోధి ఆలయంలోని వరుస పేలుళ్లు తమ పనేనని ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించింది. ఈ ఉగ్రవాద సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. అదే సమయంలో ముంబైలో తమ తర్వాత లక్ష్యమని హెచ్చరించింది. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ట్విట్టర్ అకౌంటులో తొమ్మిది బాంబు పేలుళ్లకు తామే బాధ్యులమని పేర్కొన్నారు.

కాగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేలు బుధవారం బుద్దగయలోని మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. పేలుళ్లపై కేంద్రం ముందుగానే బీహార్ ప్రభుత్వాన్ని హెచ్చరించిందని షిండే అన్నారు. పేలుళ్ల ఘటనపై అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు.

Bodhgaya

ఆదివారం ఉదయం మహాబోధి ఆలయ ప్రాంగణంలోని తొమ్మిది వరుస పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఐదుగురు మాత్రం గాయపడ్డారు. బీహార్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం బాంబు పేలుళ్ల కేసు దర్యాఫ్తును జాతీయ దర్యాఫ్తు(ఎన్ఐఏ)కు అప్పగించింది.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, రవిశంకర ప్రసాద్ తదితరులు మంగళవారం బోదిగయను సందర్సించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+