అస్సాం వరదలు: ప్రజలకు దేవుడే దిక్కు (పిక్చర్స్)
గౌహతి: వరదల్లో చిక్కుకున్న అస్సాం రాష్ట్రానిది పాత కథే. బ్రహ్మపుత్ర, దాని ఉప నదులు ముంచెత్తడంతో పరిసర ప్రాంతాలు తీవ్ర నష్టానికి గురి కావడం ప్రతిసారీ జరుగుతున్నదే. మాయోంగ్ ఉత్తర ప్రాంతం ప్రతిసారీ ఈ సమస్యకు గురవుతూ వస్తోంది. మోరిగావ్ జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ పనుల శాఖ నిర్లక్ష్యమే దీనికి కారణమని భావిస్తున్నారు.
ఏడాది వరద తాకిడి ముప్పును ఎదుర్కోబోతున్న ప్రాంతాల సహాయానికి ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చిన దాఖలు కనిపించడం లేదు. నిరుడు వరదల్లో నష్టపోయిన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంపై కూడా ప్రభుత్వ శాఖలు శ్రద్ధ చూపలేదు.
నిరుడు వరదల్లో కొట్టుకుపోయిన వంతెనలను పునరుద్ధరించలేదు. రోడ్లను మరమ్మత్తు చేయలేదు. ఈ స్థితిలోనే స్థానిక ప్రజలు తమ మనుగడ సాగిస్తున్నారు. ఈసారి వరదలను అదే పరిస్థితిలో ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధపడ్డారు. వారిని పట్టించుకున్న పాపాన ప్రభుత్వాధికారులు పోలేదు.

గౌహతిలోని వరదలో ఓ వెండర్ ఇలా మూటను నెత్తిన పెట్టుకుని నడిచిపోతున్నాడు.

గౌహతిలోని వరదలో కారు ముందుకు సాగడానికి మొరాయిస్తూ ఇలా..

గౌహతి వద్ద 37వ జాతీయ రహదారి నిండా నీటితో మునిగిపోయింది. మోటార్ సైకిల్‌ను నడపడానికి ప్రయత్నిస్తూ ఓ వ్యక్తి

వరద తాకిడికి అస్సాంలోని 11 జిల్లాల్లో 350 గ్రామాలు గురయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదలకు ఒకరు మరణించారు.

అస్సాంలోని నాగావ్ ప్రాంతంలో వరదల్లో పశువులను తోలుకుటూ పిల్లలు ఇలా..

అస్సాంలోని వరద తాకిడి ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు నాటు పడవల్లో తరలిపోతున్న ప్రజలు

అస్సాం వరదలు పశువులను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టాయి. అస్సాంలోని కజరింగ నేషనల్ పార్కులో ఓ ఏనుగు ఇలా..

అస్సాంలోని నాగావ్ ప్రాంతంలోని బోంగావ్‌లో సురక్షిత ప్రాంతానికి తరలడానికి అరటి బోదెను వాడుతూ ఇలా...

అస్సాంలోని ముజాలి నుంచి జోర్హాత్‌కు మోటార్ సైకిళ్లను బ్రహ్మపుత్ర నదిని దాటిస్తూ ఇలా..
అస్సాంలోని వరదలకు చిరాంగ్ జిల్లా, బోడోలాండ్ ప్రాదేశిక మండలి ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. సిడ్లి, బిజ్లి సర్కిల్స్‌లోని 20 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేయి మందికిపైగా ప్రజలు వరద తాకిడికి గురైనట్లు ది సెంటినల్ రిపోర్టు చేసింది.
ఇళ్లు, వంతెనలు, సాగు భూములు ధ్వంసమయ్యాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏయి, హిందుతి, నంగల్, లంగఖర్, చపామతి నదులు ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నాయి. దానికితోడు నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. చిరాంగ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు.
గత 24 గంటల్లో దేమాజి, నాగావ్ జిల్లాల్లోని 52 గ్రామాల్లోని 14 వేల మంది ప్రజలు వరద తాకిడికి గురయ్యారు. జోర్హాత్ సమీపంలోని నిమటిఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది.












Click it and Unblock the Notifications