ఉత్తరాఖండ్: వర్షాలతో ఒకే కుటుంబంలో ఏడుగురు బలి

దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఏడుగురు శిథిలాల కింద పడి మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటన ఈ రోజు ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో జరిగింది. ఐదు మృతదేహాలను శిథిలాల కింద నుండి వెలికి తీశారు.
రెండు మృతదేహాలు శిథిలాల కింద ఉన్నాయి. ఈ ఘటన జరిగిందని తెలియడంతో చమోలి జిల్లా మెజిస్ట్రేట్ ఎస్ఏ మురుగేశన్ సహా పలువురు అధికారులు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. సహాయ చర్యలను అధికారులు పర్యవేక్షించారు.
మరో ఘటనలో నలుగురు మృతి
మరో ఘటనలో నలుగురు మృతి చెందారు. గర్ఙవాల్ ప్రాంతంలోని ద్వారికల్ డెవలప్‌మెంట్ బ్లాక్ వద్ద ఓ జెసిబి కందకంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.












Click it and Unblock the Notifications