ఉండవల్లి చిట్టా విప్పుతా, బైక్‌పైన తిరిగాడు: విజయలక్ష్మి

త్వరలో తాను ఉండవల్లి అక్రమాస్తుల చిట్టా విప్పుతానని హెచ్చరించారు. గతంలో ఉండవల్లి ఓ ద్విచక్ర వాహనం పైన తిరిగే వారని, ఇంత తక్కువ కాలంలో ఆయనకు రెండు కార్లు, రెండు విలాస భవనాలు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. జగన్ పైన విమర్శలు గుప్పిస్తున్న ఉండవల్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్తుల పైన ఎందుకు మాట్లాడరన్నారు.
గతంలో ఉండవల్లి పంచలోహ విగ్రహాల కేసులో అరెస్టయ్యారని మరో నేత టికె విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు. రాజకీయ నేపథ్యం లేని ఉండవల్లిని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేరదీసి రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిని చేశారన్నారు. ఆలాంటి వ్యక్తి వైయస్ కుటుంబం పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్సలు చేయడం ద్వారా ఉండవల్లి రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. నేర చరిత్ర కలిగిన ఉండవల్లికి తమ అధ్యక్షుడి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.












Click it and Unblock the Notifications