వెంటాడిన దురదృష్టం: పట్టుబడిన ముగ్గురు ఆడదొంగలు
హైదరాబాద్: అడదొంగలు మొదటిసారి ఓ నగల దుకాణంలో చేసిన ప్రయత్నం ఫలించడంతో రెండోసారి అదే పని చేయబోయారు. కానీ రెండోసారి నగల దుకాణంలో దొంగతనం చేయబోయి పట్టుపడ్డారు. మొదటిసారి దొంగతనం చేసినప్పుడు సిసిటీవీ కెమెరాల్లో రికార్డయింది. దాంతో రెండోసారి దొంగతనం చేయబోయి పట్టుబడ్డారు.
హైదరాబదులోని చందానగర్‌లో కొత్తగా పెట్టిన నగల దుకాణంలోకి దొంగతనం కోసం ముగ్గురు మహిళలు ప్రవేశించారు. దొంగతనం చేసి పారిపోదామని అనుకున్న సమయంలో షోరూం మేనేజ్‌మెంట్‌కు అనుమానం వచ్చి పట్టుకున్నారు.

ఖజానా నగల దుకాణం చందానగర్ శాఖ అధికారులు ఆ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల క్రితం ఆబిడ్స్, సోమాజిగుడా శాఖలో దొంగతనం చేసిన మహిళలు వీరేనని పోలీసులు గుర్తించారు. వారిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహిళలు తమ దుకాణంలోకి ప్రవేశించిన తర్వాత అనుమానం వచ్చి ఆబిడ్స్, సోమాజిగుడా దొంగతనం సంఘటన వీడియోలను పరిశీలించామని, తమ ఉద్యోగులు వారిని గుర్తించారని, వారిపై కన్నేసి ఉంచాలని చెప్పామని దుకాణం అధికారులు చెప్పారు. చెవిపోగులు, రింగులు దొంగతనం చేసిన సంఘటన సిసిటీవీ ఫుటేజ్‌లో రికార్డయి ఉంది. ఆ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.












Click it and Unblock the Notifications