సోనియా ఇంటి వద్ద బొత్సకు పరాభవం: డిగ్గీదే ఫైనల్

Botsa Satyanarayana
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఢిల్లీలో అవమానం జరిగింది. శనివారం ఉదయం యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసం వద్ద ఆహార భద్రతా చట్టంపై కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతోంది. అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే సమావేశానికి వెళ్లిన బొత్సను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

సమావేశంలో పాల్గొనడానికి వచ్చానని చెప్పినా సిబ్బంది వినిపించుకోకపోవడంతో బొత్స వారితో వాగ్వాదానికి దిగారు. భేటీలో పేరు లేదని భద్రతా సిబ్బంది అనుమతి నిరాకరించడంతో అవమానంతో బొత్స వెనుదిరిగారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం సమావేశమయ్యారు.

తెలంగాణపై తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ మాటలే ఫైనల్ అని బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ కోర్ కమిటీ సమావేశం తర్వాత దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసారని, ఇక తెలంగాణపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పిసిసి సమన్వయ కమిటీ, మానిఫెస్టో కమిటీల్లో మార్పులపై తాను దామోదర రాజనర్సింహ అభిప్రాయం కోరినట్లు ఆయన తెలిపారు.

యుపిఎ ప్రభుత్వం తీసుకురావడానికి తలపెట్టిన ఆహార భద్రత చట్టం గురించి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పీ నాయకులతో సమావేశమయ్యారు. ఆహార భద్రత చట్టం ప్రాముఖ్యం గురించి ఆమె వారికి వివరించారు. సమావేశానికి కోర్ కమిటీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+