పాలు తాగుతూ కొరికాడని కత్తెరతో పొడిచిన తల్లి

8 నెలల పసికందు పాలు తాగుతూ కొరికాడని కోపంతో కత్తెరతో పసికందు ముఖాన్ని 90 సార్లు పొడిచింది చైనాలోని ఓ తల్లి. పాలు తాగుతుండగా రొమ్ము కొరికాడు ఆపసికందు జియావో బావో. ఎనిమిది నెలల పసిగుడ్డుకు పళ్లు కూడా అంత వాడిగా ఉండవు, అయినా ఆసమయంలో బిడ్డ కొరికితే పులకరించిపోతారు తల్లులు. అలాంటిది ఆ తల్లి కోపంతో ఊగిపోయి కత్తెర తీసుకుని పసికందు ముఖాన్ని 90 సార్లు పాశవికంగా పొడిచింది.
రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ బిడ్డను సమీప బందువు గమనించి వెంటనే ఆసుపత్రికి చేర్చారు. ఇప్పుడు ఆ పసిగుడ్డు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ బిడ్డకు ప్రాణాపాయం తప్పింది. తల్లి ఏ విధమైన మానసిక వైకల్యం కూడా లేదట.
ఎనిమిది నెలల జియావో బావోకు వందకు పైగా కుట్లు అవసరమని వైద్యులు అంటున్నారు. తల్లి తప్పును అంగీకరించింది. బిడ్డకు ఇద్దరు అంకుల్స్ ఉన్నారని, తల్లికి మానసిక వైద్యులు లేరని చెబుతూ బిడ్డను తమ ఆధీనంలోకి తీసుకోవాడనికి ప్రభుత్వాధికారులు నిరాకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications