వెంటాడి రోడ్డుపై స్త్రీని చంపారు, రైలు నుంచి తోసేశారు

ఇటువంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి అని పాట్నా సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ మను మహరాజ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన చెప్పారు. ఓ వివాదంలో బంధువులే ఆమెను హత్య చేశారని చెప్పారు.
ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి ఆదివారం రాత్రి నుంచే ప్రయత్నాలు చేస్తున్నామని, అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందాలను రంగంలోకి దింపామని అన్నారు. వార్త తెలిసిన వెంటనే వందలాది మంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
దోచుకుని రైలు నుంచి తోసేశారు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళను రైలులో దోచుకుని ఇద్దరు సాయుధులు రైలు నుంచి కిందికి తోసేశారు. లక్నోలో ఆమె రైలు ఎక్కింది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌న నుంచి ఘజియాబాద్ స్టేషన్‌లో దిగుతుండగా అరవై ఏళ్ల మహిళపై దుండగులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె రైల్వే ట్రాక్‌పై స్పృహ తప్పి పడిపోయింది.
ఆమె నుంచి ఆభరణాలు, నగడు, మొబైల్ ఫోన్ ఉన్న పర్సును దుండగులు లాక్కుని పారిపోయారు. ముందు ఆమెకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిందితులను గుర్తించడానికి పోలీసులు సిసిటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications