ఏదైనా కట్టుబడాలి: గండ్ర, అక్కడ జరిగిందే ఇక్కడ: గంటా

చిన్న రాష్ట్రాలతో నక్సల్స్ సమస్య వస్తుందనే వాదన సరికాదని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి పైనే మావోయిస్టులు దాడి చేసిన వాస్తవాన్ని మరిచిపోవద్దన్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో నక్సల్స్ సమస్య లేదని గుర్తు చేశారు. విభజనపై పార్టీ పెద్దల నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ పథకాలను విమర్శిస్తున్నాయన్నారు.
ఒత్తిడి తెస్తాం: పొన్నం
తాము తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడేలా చేస్తామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో అన్నారు. పార్లమెంటు సమావేశాల కంటే ముందే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటు కోసం ఒత్తిడి తెస్తామన్నారు. కీలక సమయంలో సీమాంధ్ర నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సమైక్య సభకు అనుమతి ఇస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు.
అక్కడేం జరిగిందో ఇక్కడా అంతే: గంటా
రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోయే ప్రసక్తి లేదని మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖలో అన్నారు. కోర్ కమిటీలో ఏం జరిగిందో సిడబ్ల్యూసిలోను అదే జరుగుతుందన్నారు. ఎన్నికల కోసం డ్రామాలు ఆడాల్సిన అవసరం కాంగ్రెసు పార్టీకి లేదన్నారు. కాగా కోర్ కమిటీ తెలంగాణపై తేల్చుతుందని అందరూ ఎదురు చూశారు. కానీ ఆ ఆశలు నీరుగారిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications