కిరణ్ హీరో అయ్యేందుకు కాదు, ప్యాకేజీ వరం: జగ్గారెడ్డి

తెలంగాణ వెనుకబడిందని చెబుతున్న తెలంగాణవాద పార్టీలు, తెలంగాణవాదులు ముఖ్యమంత్రి ప్రతిపాదించిన భారీ ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగితే మత రాజకీయాలు శాసిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ప్యాకేజీ ఓ వరమని, ఆ ప్యాకేజీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో విమర్శలు చేస్తున్న వారు చెప్పాలన్నారు. నక్సల్స్ ఉనికి పైన ముఖ్యమంత్రి హోదాలోనే కిరణ్ చెప్పారన్నారు. తెలంగాణతో పాటు మిగతా జిల్లాల్లోను వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని కిరణ్ కోరారన్నారు.
ప్యాకేజీల వల్ల నాయకులకు కాకుండా ప్రజలకు లాభం చేకూరుతుందన్నారు. తెలంగాణ ఏర్పడితే ప్రజల పరిస్థితి దుర్భరమే అన్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలం అవుతుందన్నారు.
ఉప ముఖ్యమంత్రిని కలిసిన అక్బర్
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను మజ్లిస్ పార్టీ శాసన సభ్యుడు, పార్టీ ఇతర నేతలు మంగళవారం కలిశారు. ఢిల్లీ రాజకీయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉస్మానియా విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి, తెలంగాణ విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి, పలువురు ఉద్యోగ సంఘ నేతలు కూడా దామోదరను కలిశారు.
వైషమ్యాలు పెంచుతోంది: నారాయణ
బ్యాట్సుమెన్, బౌలర్ల పేరిట కాంగ్రెసు పార్టీ ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విజయవాడలో ఆరోపించారు. రాష్ట్ర విభజన, అవినీతి అంశాలు రాష్ట్ర పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయన్నారు. 23 జిల్లాల్లో కాంగ్రెసును ఐక్యంగా ఉంచలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా ఐక్యంగా ఉంచుతారని ప్రశ్నించారు. రిలయన్స్ గుప్పిట్లో ఉన్నారని కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. శిక్ష పడ్డ వారు పోటీ చేయొద్దన్న సుప్రీం తన తీర్పును పునఃసమీక్షించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications