వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై ఏదైనా: ఆగస్టులో చంద్రబాబు బస్సుయాత్ర!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu to leave on bus yatra in August
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసిన సందర్భంలోనే త్వరలో బస్సుయాత్ర చేపడతామని పార్టీ తెలిపింది. ఆగస్టు 24 నుండి బస్సుయాత్ర ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కేంద్రం తెలంగాణపై ఎలాంటి నిర్ణయం ప్రకటించినా తాను మాత్రం త్వరగా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారట.

పంచాయతీ ఎన్నికల అనంతరం మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు జరిగితే మాత్రం వాటి తర్వాత ప్రారంభించే అవకాశముంది. లేదంటే ఆగస్టు చివరి వారంలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వస్తున్నా మీకోసం పాదయాత్రలో బాబు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు, కడప తదితర జిల్లాలకు వెళ్లలేదు. బస్సుయాత్రతో వాటిని కూడా చుట్టి రానున్నారు.

తెలంగాణపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బాబు పాదయాత్రపై సందిగ్ధం కూడా అవసరం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, తమ నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పాని, కాబట్టి ఇక దాని గురించి తమ పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. కేంద్రం తెలంగాణపై ఎలాంటి ప్రకటన చేసినా బస్సుయాత్రతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో బాబు ఉన్నారట.

విజయం మనదే: బాబు

'రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి పంచాయతీ ఎన్నికలతో శంఖం పూరించాలి. మీ సత్తా చాటండి. అఖండ విజయంతో నాయకత్వాన్ని రుజువు చేసుకోండి. సమర్థ పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధికి నేతృత్వం కోసం దూసుకు రండి' అని తమ పార్టీ సర్పంచి అభ్యర్థులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన వారికో లేఖ రాశారు. ప్రస్తుత ఎన్నికల్లో వారి గెలుపు భవిష్యత్తు విజయాలకు పునాదిగా నిలుస్తుందని అందులో పేర్కొన్నారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu plans to undertake a bus yatra in August to the districts he was unable to cover during his Vastunna Meekosam padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X