నా దారి రహదారి: ఎందరో నరేంద్ర మోడీలు! (పిక్చర్స్)

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రచార సారథి నరేంద్ర మోడీ తన ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. 2014లో బిజెపిని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఒకే వారంలో పుణే, పూరీ, నాగపూర్‌లను చుట్టి వచ్చారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీ పైన మోడీ నిప్పులు చెరుగుతున్నారు.

వచ్చే నెల రెండో వారంలో(ఆగస్ట్ 11) మోడీ హైదరాబాద్ వెళ్లనున్నారు. పలుచోట్ల మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీతో పాటు ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో మోడీ సభకు రూ.5 వసూలు చేయాలన్న అంశాన్ని కూడా కాంగ్రెసు పార్టీ తప్పు పట్టింది.

అయితే వసూలు చేసిన ఆ డబ్బును పార్టీ కోసం ఖర్చు చేసేందుకు కాదని, ఉత్తరాఖండ్ బాధితుల కోసమనే విషయాన్ని విమర్శలు చేసేవారు తెలుసుకోవాలని బిజెపి ఎపి రాష్ట్ర శాఖ చెప్పింది. ప్రచార సారథిగా ఎన్నికయ్యాక మోడీ తన యాత్రను గత నెల 23న ఆరంభించారు.

పంజాబ్‌లోని మాదాపూర్‍‌లో ఆయన ఓ ర్యాలీలో ప్రసంగించారు. ఆ తర్వాత ముంబై వెళ్లారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బీహార్‌లో పార్టీ ర్యాలీలో ప్రసంగించారు. 2014 ఎన్నికల బిజెపి గెలుపు కోసమే మోడీ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను చుట్టి రావడం ఆరంభించారు.

పూరీలో మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రచార కమిటీ సారథి నరేంద్ర మోడీ ఇటీవల పూరిలో జగన్నాథుడిని దర్శించుకున్నారు.

మోడీ అభివాదం

భారతీయ జనతా పార్టీ ప్రచార కమిటీ సారథి నరేంద్ర మోడీ పూరీలోని గుండిచ దేవాలయం ముందు కార్యకర్తలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం

భువనేశ్వర్‌లో...

భువనేశ్వర్ విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ

మోడీలు!

భువనేశ్వర్‌లో నరేంద్ర మోడీ మాస్కులతో హల్ చల్ చేస్తున్న బిజెపి కార్యకర్తలు. మంగళవారం మోడీ భువనేశ్వర్ వచ్చారు. ఈ సమయంలో మాస్కులు పలువురు ఆయన మాస్కులతో స్వాగతం పలికారు.

ఫెర్గుసన్ కళాశాలలో...

మూడు రోజుల క్రితం పుణేలోని ఫెర్గుసన్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.

శివాజీకి పూలమాల

పుణేలోని ఫర్గుసన్ కళాశాలలో ప్రాంతంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న నరేంద్ర మోడీ

ముంబైలో..

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంబే స్టాక్ ఎక్క్చేంజ్‌లో మంగళవారం ప్రజాస్వామ్యం ద్వారా సుపరిపాలన పై మాట్లాడుతున్న నరేంద్ర మోడీ

ముంబైలో అభివాదం

ముంబైలో వ్యాపారవేత్తలతో సమావేశం అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బయట ఉన్న వారికి అభివాదం చేస్తున్న దృశ్యం

మాదాపూర్‌లో...

పంజాబ్‌లోని మాదాపూర్‌లో బిజెపి సంకల్ప ర్యాలీలో ప్రసంగిస్తున్న బిజెపి 2014 ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ

పంజాబ్‌లో..

పంజాబ్‌లోని మాదాపూర్‌లో బిజెపి సంకల్ప ర్యాలీలో కార్యకర్తలు ఇచ్చిన కరవాలంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+