హేట్ స్పీచ్: అక్బరుద్దీన్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట

ఈ రోజు కోర్టు దానిపై తీర్పు ఇచ్చింది. ఒక నేరానికి సంబంధించి వేర్వేరుగా ఎప్ఐఆర్‌లు దాఖలైనా, ఒకే సంస్త దర్యాఫ్తు చేస్తుందని హైకోర్టు తెలిపింది. కేసులన్నీ ఒకటిగా చేసి సిఐడితో విచారణ జరిపించాలని ఆదేశించింది.
కాగా, అక్బరుద్దీన్ ఓవైసీ అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగాను గత జనవరిలో అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను కొన్నాళ్లు జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు.
ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుండి పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు.. తదితర ప్రాంతాల్లో పలువురు అక్బరుద్దీన్ పైన ఫిర్యాదు చేశారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications