డిజిపికి ఢిల్లీ పిలుపు: కిరణ్ రెడ్డిపై ధ్వజమెత్తిన జానా

Jana Reddy and Dinesh Reddy
హైదరాబాద్: రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డికి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దినేష్ రెడ్డికి పిలుపు రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఢిల్లీలో మూడు రోజుల పాటు అందుబాటులో ఉండాలని ఢిల్లీ పెద్దలు ఆయనకు సూచించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తే పరిణామాలపై, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై దినేష్ రెడ్డితో ఢిల్లీ పెద్దలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి కె. జానారెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, వి హనుమంతరావుతో శనివారంనాడు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు లీకులు ఇవ్వడం క్రమశిక్షణా రాహిత్యమని ఆయన సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి లీకులపై కాంగ్రెసు అధిష్టానానికి సమాచారం ఉందని ఆయన అన్నారు. మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడం సరి కాదని ఆయన అన్నారు. ఎవరెన్ని చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటేనే నక్సలిజం పెరుగుతుందని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి లీకులు ఇవ్వడం అధిష్టానం దృష్టికి వెళ్లిందని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేదంటే మూడుగా విభజించాలని రాయలసీమ ప్రాంతానికి చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. కాగా, హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్క్ వద్ద సమైక్యాంధ్ర సమితి నేతలు శనివారం ఉదయం ధర్నాకు యత్నించారు. అయితే అనుమతి లేదంటూ పోలసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+