భార్యను చంపి, ఆత్మహత్య చేసుకున్న పారిశ్రామికవేత్త

ఆ తర్వాత అతను లాలాగుడా రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి గల కారణాలేమిటనేది తెలియడం లేదు. మురళీకృష్ణకు, లక్ష్మికి ఏడాదిన్నర క్రితం వివాహమైందని సమాచారం. వీరి బంధువులు సింగపూర్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారి నుంచి సమాచారం తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ సంఘటనపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారిద్దరి మృతి వెనక కారణమేమై ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలున్నట్లు అనుమానిస్తున్నారు. మురళీకృష్ణ సూసైడ్ నోట్ కూడా పోలీసులకు చిక్కినట్లు చెబుతున్నారు. షేర్ మార్కెట్లో నష్టపోవడం వల్లనే ఆయన ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలావుంటే, గుజరాత్‌లోని సూరత్ ప్రాంతంలోని జునాగఢ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు బట్టల మిల్లులో పనిచేసేవారని తెలుస్తోంది.
రాష్టంలోని నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి చెరువు వద్ద వరద ప్రవాహంలో ఓ విద్యార్థి కొట్టుకుపోయాడు. అతను నీళ్లలో మునిగి చనిపోయాడు. అతన్ని దేవునిపల్లికి చెందిన లక్ష్మణ్‌గా గుర్తించారు.












Click it and Unblock the Notifications