అప్పటిదాకా నమ్మలేం, 36 గంటలు చాలు: టిపై కెకె

కాంగ్రెసు వర్కింగ్ కమిటీలో హైదరాబాద్, నీళ్లపై 2000లలోనే చర్చ జరిగిందని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవడమే మిగిలిందని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని 36 రోజుల్లో ఏర్పాటు చేయవచ్చునని కెకె అన్నారు.
లీకులను ఖండించాలి
తెలంగాణ రోడ్ మ్యాప్‌లపై తమ పేర్లతో వచ్చిన మీడియా లీకులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఖండించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఖండించకపోతే అంగీకరించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యున్నత సమావేశంలో జరిగిన విషయాలను లీక్ చేయడం సరి కాదని ఆయన అన్నారు. బిసీ విద్యార్థులకు మొత్తం ఫీజును రీయంబర్స్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే బిసి విద్యార్థులకు అన్యాయం చేసినట్లేనని ఆయన అన్నారు.
అక్టోబర్‌కల్లా రెండు రాష్ట్రాలు
తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి ఆంటోనికి చె ప్పామని, దీనిపై సానుకూలంగా స్పందించిన ఆంటోని త్వరలో తెలంగాణపై తేల్చేస్తామని చెప్పినట్లు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణపై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న వెంటనే రెండు పిసిసిలు ఏర్పాటు చేస్తారన్నారు. అక్టోబర్ కల్లా రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని పాల్వాయి ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications