ఆచార్య బంధువు అరెస్టు: వ్యక్తి నుంచి తుపాకి సీజ్

ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని అమెరికన్ కాన్సులేట్ వద్ద భద్రతను అధికం చేశారు. కాన్సులేట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం జరిపిన తనిఖీల్లో కడపకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి నుంచి తుపాకీ, నాలుగు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద రివాల్వర్‌కు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బంజారాహ్సిలోని రాఘవేంద్ర స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న స్వామి అనే విద్యార్థి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ స్వామి మృతి చెందాడు. ప్రిన్సిపాల్ వేధించాడనే మనస్తాపంతో స్వామి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సర్పంచ్ అభ్యర్థి అరెస్టు
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం గంగారపు వాండ్లపల్లెకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థి విజయానందరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడుతూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం బాటిళ్లను సరఫరా చేస్తుండగా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.ఆయనతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. నాగులగుట్టపల్లిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మద్యం దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications