అదృశ్యమైన టెక్కీ భార్య శవం గోనె సంచీలో..

మృతి చెందిన గంగాదేవి భర్త శరవణన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని, తన భార్య అదృశ్యంపై అతను జులై 15వ తేదీన ఫిర్యాదు చేశాడని కేవరిపక్కం పోలీసులు శుక్రవారంనాడు చెప్పారు. ఆమె హత్యలో తిరునిద్రవూర్‌లోని గంగాదేవి తల్లిదండ్రుల పొరుగున ఉండే కార్తీక్ పాత్ర గురించి పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చెన్నైకి 110 కిలోమీటర్ల దూరంలో గల వెల్లూరు జిల్లాలోని వాల్లాజా చెరువు వద్ద సంచీలో గంగాదేవి శవం కనిపించింది. గోనె సంచీని కుక్కలు పీకుతుండడం, దుర్వాసన వస్తుండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితమే ఆమెను హత్య చేసి ఉంటారని, శవం పూర్తిగా కుళ్లిపోయిందని, గుర్తించలేని రీతిలో ఉందని పోలీసులు చెప్పారు.
అనుమానం వచ్చి శరవణన్‌కు, గంగాదేవి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు వాల్లాజా ఆస్పత్రికి వచ్చి శవాన్ని గుర్తించారు. అయితే, వారు కూడా సరిగా నిర్ధారించలేకపోతున్నారని, దీంతో డిఎన్ఎ పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications