ప్రియుడితో భార్య పరారీ: భర్త ఆత్మహత్య, నర్సు సూసైడ్

తన నివాసంలోనే బసవరాజ టాక్సిక్ లిక్విడ్ తాగినట్లు పోలీసులు తెలిపారు. అంతకు ముందు కూడా చాలాసార్లు రాజమ్మ తన ప్రియుడు మహేష్‌తో వెళ్లిపోయింది. అయినా, పిల్లల కోసం అతను ఆమెను చేరదీస్తూ వచ్చాడు. కానీ ఈసారి అతను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బసవరాజుకు పెళ్లయి 20 ఏళ్లవుతోంది. అతనికి ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు.
మనీషా మాతే అనే 23 ఏళ్ల నర్సు విషం తీసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇంజెక్షన్ ఓవర్ డోజు తీసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె జోషీవాడి నివాసి.
అజ్నీలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న మనీషా బుధవారంనాడు సాయంత్రం ఇంజెక్షన్ కొనుక్కుని వచ్చిందని, గురువారం ఉదయం మరణించిందని ఆమె తమ్ముడు చెప్పాడు. సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. ఆమెకు తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులు ఉన్నారు.












Click it and Unblock the Notifications