తమిళనాడు బిజెపి నేత హత్య, బంద్‌కు పిలుపు

నిందితులను గుర్తించడానికి, హత్యకు కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గత తొమ్మిది నెలల కాలంలో తమిళనాడులో బిజెపి సీనియర్ రాజకీయ నాయకుడు హత్యు గురికావడం ఇది రెండోసారి. బిజెపి రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ వి. అరవింద్ నిరుడు అక్టోబర్‌లో వెల్లూరులోని తన క్లినిక్‌లో హత్యకు గురయ్యాడు.
నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. కాగా, రమేష్ హత్యకు నిరసనగా బిజెపి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. పార్టీ వ్యవహారాలపై మాట్లాడేందుకు రమేష్ శుక్రవారం రాత్రి 9 గంటలకు కార్యాలయానికి వెళ్లాడని, తిరిగి వచ్చినప్పుడు నలుగురు వ్యక్తులు దాడి చేసి ఆయనను హత్య చేశారని సేలం రేంజ్ పోలీసు డిఐజి సంజయ్ కుమార్ చెప్పారు.
రమేష్ హత్యతో వెంటనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు బస్సులపైకి రాళ్లు రువ్వారు. తమ పార్టీ నాయకులకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు రాధాకృష్ణన్ విమర్సించారు. గత ఏడాది కాలంలో తమ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు అరుణ్ రెడ్డి, పి. మురుగన్, వెల్లియన్ హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర నాయకులకు ఫోన్ చేసి సంఘటన గురించి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications