సోనియాకు లేఖ రాసే యోచన, ముగ్గురికి మళ్లీ పిలుపు

ఆ ముగ్గురికి పిలుపు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అధిష్టానం నుండి మరోసారి పిలుపు వచ్చింది. దామోదర ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బొత్స, కిరణ్‌లు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు.
ఎల్లుండి కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 28న సిడబ్ల్యూసి సమావేశంలో జరిగే అజెండా ఖరారు పైన చర్చించనున్నారు. సిడబ్ల్యూసిలో తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే దామోదర, కిరణ్, బొత్సలకు మరోసారి పిలుపు వచ్చింది.
జైపాల్‌తో దామోదర భేటీ
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
రచ్చబండపై కేబినెట్ భేటీ
రచ్చబండపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు భేటీ అయింది. కొండ్రు మురళీ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణ, బాలరాజు, కన్నా లక్ష్మీనారాయణ, శైలజానాథ్ తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications