మనిషిని ముక్కలుగా నరికి, సంచీల్లో పడేశారు

పదహారో జాతీయ రహదారి పక్కన ఓ సంచీ నుంచి దుర్వాసన వస్తుండడాన్ని గురువారం ఓ ఆటో రిక్షా డ్రైవర్ గమనించాడు. దాన్ని అతను విప్పి చూశాడు. ఆకుపచ్చ వస్త్రంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మాంసం ముద్దలను అతను గమనించి, పోలీసులకు సమాచారం అందించాడు.
తల, కుడిచేయి, రెండు కాళ్లు అందులో లేవు. పోలీసులు ఈ ప్యాకేజీని తనిఖీ చేస్తుండగా, అటువంటి సంచీయే సమీపంలో ఉన్నట్లు సమాచారం అందింది. ఎర్రటి సంచీలో కుడిచేయిని పెట్టి పడేశారు. దాంతో డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. సమీపంలో ఓ కాలు కూడా కనిపించింది. ఎడమ చేయి, కాలు, తల జాడ తెలియలేదు.
సమీపంలోనే మంట పెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు బూడిదను, బొక్కలను సేకరించారు. శవంపై వాంతి చేసుకున్న ఆనవాలు ఉంది. దాని నమూనాలను కూడా పరీక్షల నిమిత్తం సేకరించారు. ఆకుపచ్చ మూటలో ఎరుపు, ఆకుపచ్చ టీ షర్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉండవచ్చునని పోలీసులు అంచనా వేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications