వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు తెలియదు: కిరణ్ రాజీనామా, సిడబ్ల్యూసిపై డిగ్గీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Digvijay Singh
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే విషయం తనకు తెలియదని ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ సోమవారం న్యూఢిల్లీలో అన్నారు. మంగళవారం నాటి సిడబ్ల్యూసి సమావేశం, అజెండా తనకు తెలియదని చెప్పారు.

తెలంగాణపై తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదని డిగ్గీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కాంగ్రెసు నేతలు తెలంగాణ కోసం ప్రయత్నాలు చేశారన్నారు. అప్పుడు ఎన్డీయే అంగీకరించలేదన్నారు. యూపిఏ సమన్వయ కమిటీలో తాను సభ్యుడిని కానని డిగ్గీ చెప్పారు. తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని, నిర్ణయమే మిగిలిందన్నారు. పంచాయతీ ఎన్నికలకు, తెలంగాణపై వైఖరికి సంబంధం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంతకుముందు దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు.

ఆహ్వానం అందలేదు: సంజీవ రెడ్డి

మంగళవారం నాటి సిడబ్ల్యూసి సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సంజీవ రెడ్డి హైదరాబాదులో అన్నారు. అయినప్పటికీ తాను హైదరాబాదుకు వెళ్తున్నట్లు చెప్పారు.

కొత్త నాటకం: హరీష్

కాంగ్రెసు పార్టీ రాయల తెలంగాణ పేరుతో కొత్తనాటకానికి తెరలేపుతోందని, దానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు కరీంనగర్లో అన్నారు. రాయల తెలంగాణ అంటే అగ్నిగుండమే అవుతుందన్నారు. తెలంగాణ ఇస్తే రాజీనామా చేస్తానన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ దానికి కట్టుబడి ఉండాలన్నారు.

English summary
AP Congress Party incharge Digvijay Singh on Monday said he don't know about CWC meet and Kiran Kumar Reddy's resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X