వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకపక్షమైతే ఉతికి ఆరేస్తాం, విభజన అడ్డుకోం: సోమిరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: విభజనపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఉతికి ఆరేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం అన్నారు. విభజనను తాము అడ్డుకోమని అయితే, ఏకపక్షంగా ఉంటే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ఇష్టానుసారంగా విభజించవద్దన్నారు. రాజధాని, నీటి కేటాయింపులు, రెవెన్యూ వాటాలు తేల్చకుంటా ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.

విభజన విషయంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. అమాయకులు చనిపోతుననందునే విభజనకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న సీమాంధ్ర ప్రాంత మంత్రులు, నేతలు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు.

సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగితే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలను తమ ప్రాంతంలో అడుగుపెట్టనిచ్చేది లేదన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ కంటే తమకే ఎక్కువగా తెలుసునన్నారు. మూడు ప్రాంతాలకు మేలు చేయాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీదే అన్నారు.

ఐదేళ్లు ఉమ్మడికి ఓకే: సురవరం

ఐదేళ్ల పాటు హైదరాబాదును రాజధానిగా చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. 10 జిల్లాల తెలంగాణకే సిపిఐ మద్దతిస్తుందని చెప్పారు.

English summary

 Telugudesam Party senior leader Somireddy Chandramohan Reddy said that they will not unilateral decisions of Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X