టిలో బిజెపి హవా, మేం ఢీ: అసద్, బిల్లుకి మజ్లిస్ ఒకే

Asaduddin Owaisi
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు బలహీనపడతాయని, భారతీయ జనతా పార్టీ బలపడుతుందని, ఆ పార్టీని మజ్లిస్ పార్టీయే ధీటుగా ఎదుర్కొంటుందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ బుధవారం అన్నారు.

కాంగ్రెసు పార్టీ ప్రకటనలో స్పష్టత లేదన్నారు. రెండు రాష్ట్రాల్లోను మజ్లిస్ శాఖలు ఉంటాయని చెప్పారు. బిజెపి బలపడుతుందని, తాము ఆ పార్టీకి ధీటుగా నిలబడుతామన్నారు. పోలవరం-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్నారు. విభజన అనివార్యమైనందున తెలంగాణ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే తాము మద్దతిస్తామన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహారం పూర్తి చేయాలన్నారు. భవిష్యత్తులో బిజెపితో తెలుగుదేశం పొత్తు పెట్టుకునే అవకాశముందన్నారు. హైదరాబాదులో నివసిస్తున్న ఇతర ప్రాంత ప్రజలను సెటిలర్స్ అనకుండా కఠిన చట్టం తీసుకు రావాలన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని భవిష్యత్తులో డిమాండ్లు వినిపించవచ్చునని చెప్పారు.

ఉమ్మడి రాజధాని పైన మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు. మహారాష్ట్ర, మహారాష్ట్రలలో కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. మహారాష్ట్రకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని రానివ్వలేదన్నారు. అలాంటిది ఇక్కడి ప్రభుత్వం మోడీని ఎలా రానిస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా మోడీకి ఎలాంటి పేరుందో తెలుసునన్నారు. నరేంద్ర మోడీని హైదరాబాదు రావాలో వద్దో తాము చెప్పమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+