సోనియా సీమని ఇటలీలో కలిపేస్తారేమో?: బైరెడ్డి ఎద్దేవా

Byreddy Rejasekhar Reddy
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ రాయలసీమ ప్రాంతాన్ని రేపు ఇటలీలో కలిపేస్తారేమోనని రాయలసీమ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి బుధవారం ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన జరగనుందని తాను ఎనిమిది నెలల క్రితమే చెప్పానని, అప్పుడు తన మాటను ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమకు అన్యాయం జరిగితే అందుకు సీమ నేతలే ద్రోహులు అన్నారు. గతంలో చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు ఆంధ్రాలో తమ ప్రాంతాన్ని కలిపారని, ఐదేళ్ల తర్వాత ఇటలీలోను కలిపేస్తారేమో అన్నారు. ఆగస్టు 8వ తేదిన తాను కొత్త పార్టీ పైన ప్రకటన చేస్తానని చెప్పారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాయలసీమలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ పీనుగలు లేచాయన్నారు. వాటిని నిన్ననే దహనం చేశామన్నారు. ఎక్కడ రియల్ ఎస్టేట్ డబ్బులొస్తే అక్కడ రాజధాని పెడతారని ఆరోపించారు.

రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణవాదం ప్రజల్లోకి వెళ్లిందని, దానిని ఆపలేమని గతంలోనే చెప్పానన్నారు. గతంలో మద్రాసులో షాట్ కొడితే కర్నూల్లో, ఆ తర్వాత షాట్‌కు హైదరాబాదులో పడ్డామని, ఇప్పుడు ఎక్కడ పడుతామో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+