భయమెందుకు, హైద్రాబాద్‌పై అపార్థం వద్దు: టిపై డిగ్గీ

digvijay singh
భోపాల్: హైదరాబాదులో ఓటున్న వారంతా తెలంగాణవాసులేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం భోపాల్‌లో అన్నారు. హైదరాబాదులోని సెటిలర్స్ ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఉమ్మడి రాజధాని అంశంపై తప్పుగా అర్థం చేసుకోవద్దని డిగ్గీ అన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు.

ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందన్నారు. ఉమ్మడి రాజధాని విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. తెలంగాణ బిల్లు త్వరగా ఆమోదం పొందేందుకు అందరూ ప్రయత్నించాల్సి ఉంటుందని చెప్పారు. మూడు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

కోస్తా ప్రాంతం తీర ప్రాంతమని, భారీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, అందుకే సీమాంధ్ర అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. విద్యుత్ ఉత్పత్తి అదనంగా ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన అంటే కుటుంబాన్ని విభజించినట్లేనని, సంతోషకరమైన చర్య కాదన్నారు. కానీ మూడు ప్రాంతాల ప్రజల కోసం విభజించక తప్పలేదన్నారు.

సమయం ఇంకా అయిపోలేదు

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సమయం ఇంకా అయిపోలేదని మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని చెప్పారు. పార్టీల పైన ప్రజలు ఒత్తిడి తీసుకు రావాలన్నారు. తాము తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+