ఎమోషనల్‌గా సమైక్యమే: డిఎస్, కెసిఆర్‌కు సర్వే సై

తెలుగు వారు మాసికంగా ఎప్పుడు కలిసే ఉంటారన్నారు. ఆందోళన, అభద్రతాభావం, అవిశ్వాసం ఎవరికి అవసరం లేదన్నారు. తెలంగాణ కోసం కొన్ని వందల మంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. 57 ఏళ్ల ఉద్యమానికి ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు.
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదన్నారు. తెలుగు జాతి అభివృద్ధికి ప్రశాంత వాతావరణాన్ని అందరూ నెలకొల్పాలన్నారు. ప్రశాంత వాతావరణానికి నేతలు సహకరించాలన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్ర ప్రజలను సెటిలర్స్ అనవద్దని అభిప్రాయపడ్డారు. కాగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు.
కెసిఆర్ నాయకత్వంలో సై
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధమైతే, తాము ఆయన నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు పెడుతారన్నారు.












Click it and Unblock the Notifications