హైద్రాబాద్ అందరిది: జెపి, పార్టీ ఆఫీస్‌కు ఎమ్మెల్యే తాళం

విభజన విషయమై ఏ పార్టీలు కూడా విద్వేషాలు రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు అనుకూలమన్న పార్టీలు సీమాంధ్రలో ఆందోళనలు చేయవద్దని కోరారు. విభజనను రాద్దాంతం చేయవద్దన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు రూపు వచ్చిందన్నారు.
నక్సలిజం ఉండదన్న జోగి
తెలంగాణ వస్తే నక్సలిజం ఎక్కువవుతుందన్న దాంట్లో వాస్తవం లేదని ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ అన్నారు. బిజెపి హయాంలోనే నక్సలిజం పెరిగిందని చెప్పారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
సికె బాబు 48 గంటల దీక్ష
విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సికె బాబు 48 గంటల దీక్షకు పూనుకున్నారు. సీమాంధ్ర నేతల్లో ఐక్యత లేదని మండిపడ్డారు. మంత్రులకు రోషం లేదా అని ప్రశ్నించారు. అందరూ రాజీనామా చేసి ఉద్యమించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోసం తెలంగాణ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తెలంగాణపై ప్రకటన చేసినందుకు కాంగ్రెసు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
పార్టీ కార్యాలయానికి తాళమేసిన ఎమ్మెల్యే
కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ తాళం వేసి నిరసన తెలిపారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనంతపురం జిల్లాలో 48 గంటల బందుకు పిలుపునిచ్చింది.
కుట్రను తిప్పికొడదాం
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సమర్థవంతంగా తిప్పికొడదామని విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ ఈ రోజు టాంక్ బండ్ వద్ద అన్నారు. ఆగస్టు 4న ఇందిరా పార్కు వద్ద సమైక్య సభను నిర్వహిస్తామని, ఆ సభకు తెలంగాణలోని సమైక్యవాదులు వస్తారని చెప్పారు. తెలుగు ప్రజల ఐక్యతను ఎవరు దెబ్బతీసినా వారిని శిక్షించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications