టి ఏర్పాటుపై డైలమా: ముందే ఫ్లైటెక్కిన కిరణ్, బొత్స

తాజాగా తెలంగాణ ఏర్పాటుకు అధిష్ఠానం నుంచి ప్రకటన రావడంతో కిరణ్ తీవ్ర అసంతృప్తిలో మునిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయావకాశాలు పెరిగాయని, పరిస్థితి మారిపోయిందని, తెలంగాణ ఉద్యమ ప్రభావం కూడా తగ్గిందని పలు రకాలుగా ఢిల్లీ పెద్దలకు నచ్చజెప్పేందుకు కిరణ్ విశ్వ ప్రయత్నాలు చేసినా పరిస్థితి చేయి దాటిపోయింది. ఆయన నివేదికలు, వాదనలతో సంబంధం లేకుండా అధిష్ఠానం తన పని తాను చేసుకుపోయింది.
విభజన ప్రక్రియలో తాను భాగస్వామిగా ఉండలేనంటూ చివరకు కిరణ్ రాజీనామాకు కూడా సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. అయితే రాజకీయ పరిస్థితులు, ఏఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి వ్యూహాన్ని వివరించిన అధిష్ఠానం పెద్దలు సిఎంకి నచ్చజెప్పారట. రాజీనామా చేయకుండా, నిరసన గళమెత్తకుండా మెప్పించారు. దీంతో కిరణ్ నిస్సహాయ స్థితిలో పెవిలియన్ బాట పట్టారు.
కానీ తన కళ్లెదురుగా రాష్ట్రం విడిపోతుంటే చూస్తూ ఊరుకోలేక, సీనియర్లందరినీ కాదని చిన్న వయసులోనే తనని సిఎంని చేసిన సోనియాను ఎదుర్కొనలేక కిరణ్ మదనపడుతున్నారట. సోనిమా మాటను గౌరవించి, తనకిష్టం లేని రాష్ట్ర విభజనను తన చేతుల మీదుగా జరిపించడమా.. లేక విభజన ప్రక్రియకు దూరంగా ఉండేందుకు రాజీనామా చేయడమా అన్నది తేల్చుకోలేక నలిగిపోతున్నారట. తన చేతుల మిదుగానే విభజన జరిగితే చరిత్రలో కిరణ్ రాష్ట్ర ముఖ చిత్రంపై ఒక కీలక ప్రక్రియకు సాక్షిగా నిలిచిపోతారు.
ఇక తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం తనకు శిరోధార్యమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన ఎప్పటి నుండో చెబుతున్నారు. అయితే విభజన పట్ల ఆయన కూడా అసంతృప్తిగానే ఉన్నారు.












Click it and Unblock the Notifications