ఏం చేద్దాం?: కెవిపి ఇంట్లో కేంద్రమంత్రుల మంతనాలు

 Ministers and MPs met at KVP's residence
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు నివాసంలో సీమాంధ్ర ప్రాంత నేతలు భేటీ అయ్యారు. పార్లమెంటు స్తంభన, పదవులకు రాజీనామా, సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనే అంశంపై చర్చించారు. గురువారం మరోసారి భేటీ అయి ఏం చేయాలనే నిర్ణయం తీసుకోనున్నారు.

కేంద్రమంత్రులు పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామి రెడ్డి, కనుమూరి బాపిరాజు, హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు భేటీ అయ్యారు. వారు కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

మరోవైపు హైదరాబాదులో సీమాంధ్ర మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, శైలజానాథ్, ఆనం రామనారాయణ రెడ్డి, గంటా శ్రీనివాస రావు, పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదె వెంకట రెడ్డి, వీరశివా రెడ్డి తదితరులు భేటీ అయ్యారు.

సమైక్యవాదిని: బాలరాజు

తాను సమైక్యవాదినే అని అయితే విభజనపై నిర్ణయం తీసుకున్నందున జరగాల్సిన దాని గురించి ఆలోచించాలని మంత్రి బాలరాజు అన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. తాను కాంగ్రెసువాదినని, సమైక్యవాదిని అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అన్నీ విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినందున, తప్పని పరిస్థితుల్లో అధిష్టానం బాధాకరమైన నిర్ణయం తీసుకుందన్నారు. రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని డొక్కా అన్నారు. హక్కుల కోసం పోరాడుతామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+