సీమాంధ్ర బంద్: సమైక్యంకోసం ఆమరణ దీక్ష, నేతల వెలి

వ్యాపారస్తులు స్వచ్చంధంగా దుకాణాలు బంద్ చేశారు. విద్యాసంస్థలు బంద్ పెట్టారు. విద్యార్థులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. కాంగ్రెసు పార్టీ ప్రకటన రాగానే సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిశాయి. బుధవారం ఉదయాన్నే సమైక్యవాదులు ఆయా బస్సు డిపోల ముందు బైఠాయించారు. దీంతో బస్సులు రోడ్ల పైకి ఎక్కలేదు. ఆర్టీసి సిబ్బంది ఆందోళనల్లో పాల్గొంటుంది.
విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాలు రాత్రి నుండి ఎయులో 72 గంటల ఆమరణ దీక్షకు దిగారు. విభజనను అడ్డుకోలేని నేతలను చేతకాని వారిగా పరిగణించి 18 ఏళ్లు వెలివేస్తున్నట్లు ప్రకటించారు. పలుచోట్ల కాంగ్రెసు పార్ట అధినేత్రి సోనియా గాంధీ, యూపిఏ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తూ ఐకాస నేతలు తమ నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి సీమాంధ్ర బంద్‌కు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పలువురిని ముందస్తుగా అరెస్టు చేశారు. కాగా బంద్ నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications