వైయస్‌వల్లే బీజం: సోమిరెడ్డి, అడ్డుకోం కానీ: నన్నపనేని

Somireddy Chandramohan Reddy and Nannapaneni Rajakumari
నెల్లూరు/హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే రాష్ట్ర విభజనకు బీజం పడిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసుతో, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితో అధికార కాంగ్రెసు పార్టీ నాటకాలు ఆడుతోందన్నారు. ఆ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ మరోసారి బయటపడిందని నిప్పులు చెరిగారు.

హైదరాబాదులో సీమాంధ్ర రక్షణకు కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హైదరాబాదు పైన ఇంకా ఏం స్పష్టత కావాలన్నారు. తెలంగాణకు అడ్డుపడాలన్న ఉద్దేశ్యం తమకు ఏమాత్రం లేదన్నారు. హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలనే ఆలోచన కాంగ్రెసు పార్టీకి ఎందుకు రాలేదన్నారు.

నవంబరులో ముందస్తు ఎన్నికలకు వెళ్దామని నిర్ణయించుకున్నాక కాంగ్రెసు పార్టీ తెలంగాణపై హడావుడి చేసిందని మరో నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. ఇప్పటికీ కాంగ్రెసు, ఇతర పార్టీలు తెలుగుదేశం పార్టీ పైనే అబాండాలు వేస్తున్నాయన్నారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తాము ఇప్పటి వరకు మౌనం వహిస్తూ వచ్చామన్నారు.

ముందస్తుకు వెళ్లే ఉద్దేశ్యంలో భాగంగానే వారు రాష్ట్రాన్ని విభజించారన్నారు. ఎవరినీ రెచ్చగొట్టాలనే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. తెలంగాణను అడ్డుకోవాలని తమకు లేదని అయితే, సీమాంధ్రకు మాత్రం అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగితే ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+