4సార్లు కోల్పోయాం: శ్రీకాంత్, సమైక్యం కోసం ఆత్మహత్య

తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించాని డిమాండ్ చేశారు. లేదంటే తీర్మానం సమయంలో వ్యతిరేకిస్తామన్నారు. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే పదిహేను మందిమి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు చెప్పారని, ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు పార్టీ విభజనపై నిర్ణయం తీసుకుందన్నారు.
హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా కాకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. విభజన జరిగిన పక్షంలో రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్నారు. సీమాంధ్రకు తిరుపతిని రాజధానిగా ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందన్నారు. విభజన నిర్ణయం తమను వేదనకు గురి చేసిందని పేర్కొన్నారు.
సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్య
రాష్ట్ర విభజనకు సంబంధఇంచి వార్త విని మనస్తాపం చెందిన ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడిలో ఎస్.ప్రసాద్ అనే హోంగార్డు విభజనపై ప్రకటన రావడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. అతనిని విశాఖ కెజిహెచ్ ఆసుపత్రికి తరలించాగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ వ్యక్తి విభజన వార్త విని గుండెపోటుతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications