పార్టీ లీడ్: తెలంగాణలో విజయమ్మ, సీమాంధ్రలో షర్మిల!

రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, రెండుగా విడిపోయినా తమ పార్టీయే ఇరు ప్రాంతాల్లో సత్తా చాటుతుందని ఆ పార్టీ నేతలు ఇన్నాళ్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మిగతా పార్టీలు తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాయి.
తెలంగాణను గట్టిగా వ్యతిరేకించే మజ్లిస్ పార్టీ కూడా బుధవారం మాట్లాడుతూ... తెలంగాణపై నిర్ణయం అయిపోయినందున తాము ఆహ్వానిస్తున్నామని, పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు కూడా ఇస్తామని ప్రకటించారు. అయితే తెలంగాణ అంశాన్ని కేంద్రం కోర్టులోకి మొదట నెట్టిన జగన్ పార్టీ మాత్రం ఇటీవల రాజీనామాలు, ప్రకటనలతో సమైక్య ముద్ర వేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో పార్టీని ఎలా నడిపించాలి, ఏం చేయాలనే దానిపై నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇరు ప్రాంతాల్లో పార్టీ ఉంటుందని నేతలు చెబుతున్నారు. దీంతో ఎవరు ఏ ప్రాంతంలో బాధ్యతలు చేపడతారనే చర్చ సాగుతోందట. ఇప్పటికే తెలంగాణలో పలుమార్లు పర్యటించిన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తెలంగాణ ప్రాంతంలో పార్టీకి నాయకత్వం వహించవచ్చునని, షర్మిల సీమాంధ్రలో బాధ్యతలు చేపట్టవచ్చునని చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications