కుక్క బతుకులయ్యాయి: బైరెడ్డి, ఏకపక్షం: మైసురా రెడ్డి

అనంతరం శ్రీకృష్ణ దేవరాయలకు నివాళ్లు అర్పించి అక్కడే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర పేరుతో కర్నూలు రాజధానిని హైదరాబాద్‌కు మార్చితే ఇక్కడ వచ్చి పడ్డామని, విభజన పేరుతో మళ్లీ తంతే హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నంలో రాయలసీమ వాసుల జీవితాలు పడనున్నాయని అన్నారు. దీనికంతటికి కారణం నాయకులేనని రాయలసీమ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దుయ్యబట్టారు.
రాష్ట్రాన్ని చీల్చడం వల్ల నష్టపోయే ఏ ఒక్కరితోనూ మాట్లాడకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఢీల్లీ నుంచి మంగళవారం సాయంత్రం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటన వెలువడగానే పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అనంతరం వారితో కలిసి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి. మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు.
రెండు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విభజనతో నష్టపోయే ఏ ఒక్కరితోనూ సంప్రదించకుండా ఓట్లు, సీట్లే ప్రామాణికంగా కాంగ్రెసు రాష్ట్రాన్ని చీల్చడం సరికాదన్నారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనతో కేంద్రం ముందుకు రావాలన్నారు.












Click it and Unblock the Notifications