రెచ్చగొట్టొద్దు: ఆజాద్, 4 ముక్కలు చేయాలని మాయా

వచ్చే ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని హితవు పలికారు. తెలంగాణపై ఇప్పటికే యూపిఏ, సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకుందని, కేంద్రానికి కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఇచ్చిందని, ఈ నేపథ్యంలో వచ్చే వర్షాకాల సమావేశంలోనే తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెడతామని చెప్పారు. కాగా, తెలంగాణపై కేబినెట్ నోట్ తయారు చేయాలని హోంశాఖను పిఎంవో ఆదేశించింది.
యుపిని నాలుగు రాష్ట్రాలుగా చేయాలి
తెలంగాణపై నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం అన్నారు. మొదటి నుండి తాము తెలంగాణకు అనుకూలంగానే ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, హైదరాబాదులో ఓటున్న వారంతా తెలంగాణవాసులేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం అన్న విషయం తెలిసిందే. హైదరాబాదులోని సెటిలర్స్ ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఉమ్మడి రాజధాని అంశంపై తప్పుగా అర్థం చేసుకోవద్దని డిగ్గీ అన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications