రిజైన్లపై జైపాల్ లైట్, ఎపి ప్రజలకు సారీ చెప్పాలని మోడీ

తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ నిర్ణయం ప్రకటించడానికి ఎంచుకున్న సమయంపై గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రచార సారథి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను గుమ్మం దగ్గర కాళ్లు తుడుచుకునే పట్టాలుగా ఉపయోగించుకున్నందుకు వారికి క్షమాపణ చెప్పాలన్నారు.
తెలంగాణ ఏర్పాటును తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే గత తొమ్మిదేళ్లుగా తీసుకోని నిర్ణయం ఎన్నికలకు కొద్ది నెలల ముందు హఠాత్తుగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెసు ప్రభుత్వం ఇన్నాళ్లు ఎపి ప్రజల అవసరాలను ధైర్యంగా ఎదుర్కొనలేక కమిటీల మాటున ముఖం దాచుకుందని మండిపడ్డారు.
రాజీనామాతో ఆగదు
తన ఒక్కడి రాజీనామాతో తెలంగాణ ఆగిపోదని మంత్రి విశ్వరూప్ తూర్పు గోదావరి జిల్లాలో అన్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించడమే తన లక్ష్యమన్నారు.












Click it and Unblock the Notifications