వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలు స్టార్ట్: గంటా, ఎస్పీవై, మంత్రుల్లో విభేదాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganta Srinivas Rao
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం కాంగ్రెసు పార్టీలో రాజీనామాలు ప్రారంభమయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాస రావు తన పదవికి గురువారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి కూడా రాజీనామా సమర్పించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్ తన రాజీనామాను ముఖ్యమంత్రికి పంపించారు.

మరోవైపు రాజీనామాల విషయంలో సీమాంధ్ర మంత్రులలో విభేదాలు కనిపిస్తున్నాయి. కొందరు రాజీనామాకు సిద్ధపడితే, మరికొందరు రాజీనామాలు పరిష్కారం కాదని చెబుతున్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున తమ ప్రాంతానికి ఏం కావాలో డిమాండ్ చేసే అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని చెబుతున్నారు.

మంత్రి బాలరాజు నివాసంలో వేరుగా ఐదుగురు మంత్రులు భేటీ అయ్యారు. బాలరాజు, పితాని సత్యనారాయణ, పార్థసారథి, అహ్మదుల్లా, తోట నరసింహంలు సమావేశమయ్యారు. రాజీనామాలు చేస్తే ఫలితం లేదని వారు అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది.

కిరణ్ విజ్ఞప్తి

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల విగ్రహాలకు భద్రత పెంచాలని ఆదేశించారు. సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో డిజిపి దినేష్ రెడ్డి సిఎస్‌తో భేటీ అయ్యారు.

English summary

 Minister Ganta Srinivas Rao, former minister Mandali Budda Prasad were submitted their resignations over the UPA government's decision ot birurcate the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X