అవినీతి పార్టీకి తిరస్కరణ: జగన్ పార్టీపై టిడిపి హరికృష్ణ

మూడు దశల్లో ప్రజలు టిడిపికి అత్యధిక స్థానాలను కట్టబెట్టినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సరళిని చూస్తుంటే ప్రజలు తమ పార్టీ వైపు ఉన్నాలని ఎవరికైనా అర్థమవుతుందన్నారు. కాంగ్రెసు అధికార దుర్వినియోగం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవినీతిని ఈ ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారన్నారు.
నందమూరి హరికృష్ణ ఇటీవల పలు పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైన సమయంలోను స్పందించారు. పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలహరికృష్ణ పదిహేను రోజుల క్రితం అన్నారు.
కాగా ఏకగ్రీవాలు, మూడు దశల పంచాయతీ ఎన్నికల ఫలితాలు కలిపి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మద్దతుదారులు కొద్ది తేడాతో ఆరువేల పంచాయతీల్లో గెలుపొందారు. కాంగ్రెసు ముందంజలో ఉంది. టిడిపి రెండో స్థానంలో ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడు వేల ఎనిమిది వందలు, తెలంగాణ రాష్ట్ర సమితి పద్దెనిమిది వందల పంచాయతీలను గెలుచుకుంది.












Click it and Unblock the Notifications